
Mohan Bhagwat : “హిందువులు లేకపోతే ప్రపంచమే లేదు..” మణిపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పవర్‌ఫుల్ స్పీచ్..
న్యూఢిల్లీ: ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కేంద్రబిందువు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) అన్నారు. "హిందువులు లేకుండా, ప్రపంచం ఉనికిలో ఉండదు" అని ఆయన పేర్కొన్నారు హిందూ నాగరికతకు అంతమనేది లేదని స్పష్టం చేశారు. శనివారం మణిపూర్ పర్యటన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.భగవత్ మాట్లాడుతూ, యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమ్ వంటి మహా సామ్రాజ్యాలు ఈ భూమి నుంచి పూర్తిగా అంతరించిపోయినప్పటికీ భారతీయ నాగరికత మాత్రం శాశ్వతంగా నిలిచి ఉండటానికి ఇందులో ఏదో తెలియని ప్రత్యేకత ఉందని అన్నారు. “ఎన్నో జాతులు మంచికాలం–చెడుకాలం చూశాయి. కానీ మన నాగరికతలో ఏదో శక్తి ఉంది… అందుకే మనం ఇంకా నిలిచివున్నాం,” అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.తన ప్రసంగంలో ఆయన హిందూ సమాజాన్ని ప్రపంచ ధర్మ సంరక్షకుడిగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పేర్కొన్నారు. “భారత్ అంటే అమర నాగరికత పేరు. ...

