
Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?
Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.Nanded hospital news : మహారాష్ట్ర నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు వరుసగా మృత్యువాతపడుతుండడం ఆందోళనకరంగా మారింది. తాజాగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి అధికారులు చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో.. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినవారి సంఖ్య 31కి చేరింది.
ఆస్పత్రిలో ఏం జరుగుతోంది.
నాందేడ్‌లో ఉన్న డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ దవాఖానాలో సెప్టెంబరు 30- అక్టోబరు 1 మధ్యలో ఇక్కడ 24 మంది రోగులు చనిపోయినట్లు సోమవారం సాయంత్రం వార్త వెలుగులోకి వచ్చింది. 24 గంటల వ్యవధిలో 24మంది రోగులు మరణించడం సంచలనం రేపింది. ఈ 24 మందిలో 12 మంది శిశువులు కావడం అత్యంత విషాదకరం. మరో 12 మందిలో ఐదుగురు పురుషులు...