Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: naga panchami

అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..
Special Stories

అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..

పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక పరిమళాలు వికసిస్తాయి. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలలతో సందడి నెలకొంటుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉంటుందనేది వేద పండితుల మాట. ఎంతో గొప్పదైన పవిత్రమాసం ఈ రోజు (ఆగస్టు 17)న ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ మాసంలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు వస్తున్నాయి.సనాతన ధర్మంలో (హిందూ) చంద్ర మానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో ఎంతో పవిత్రత కలిగింది ఈ శ్రావణమాసం. ఈ నెలలో  పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసమని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది.. త్రిమూర్తుల్లో స్థితికారుడు.. దుష్ట శిక్షకుడు.. శిష్ట రక్షకుడైన మహా విష్ణువుకు ఆయన దేవేరి (భార్య) మహా లక్ష్మికి ఈ శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫ...