మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు
ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం
వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్
మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు.మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా ఈ 718 మంది మయన్మార్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ఎందుకు.. ఎలా అనుమతించారనే దానిపై స్పష్టం చేయడానికి ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక నివేదికను కోరింది."ఆ 718 అక్రమ మయన్మార్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు ఖచ్చితంగా సూచించింది" అని చీఫ్ సెక్రటరీ తెలిపారు.మయన్మార్ జాతీయులు శని, ఆది...