Saturday, August 30Thank you for visiting

Tag: Muzaffarnagar incedent

అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.

అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.

National
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన లక్నో: హత్యకు గురైన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ముజఫర్‌నగర్‌ (Muzaffarnagar)  జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆగస్టు 31న 18 ఏళ్ల వయసున్న మోంటూ, అదే వయసు గల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. అయితే తమ కుమార్తెను మోంటు కిడ్నాప్ చేసినట్లు ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ జంట ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ బృదాలను ఏర్పాటు చేశారు.కాగా, సెప్టెంబర్ 13న మోంటూ కుటుంబ సభ్యులకు మీరట్‌ (Meerut) పోలీసులు ఫోన్ చేశారు. కాలువలో తల లేని యువకుడి మృతదేహం లభ్యమైందని దానిని గుర్తించాలని పిలిపించారు. దీంతో వెంటనే మార్చురీకి తల్లిదండ్రులు వెళ్లారు. మృతదేహంపై టాటూను చూసి ఆ మృతదేహం మోం...