Saturday, August 30Thank you for visiting

Tag: Muslim Rashtriya Manch

లక్నో నుంచి అయోధ్యకు 6 రోజుల పాదయాత్ర చేసిన ముస్లింలు.. రాముడికి ప్రత్యేక పూజలు

లక్నో నుంచి అయోధ్యకు 6 రోజుల పాదయాత్ర చేసిన ముస్లింలు.. రాముడికి ప్రత్యేక పూజలు

National
అయోధ్య : లక్నో నుంచి ఆరు రోజుల పాదయాత్రను ముగించుకుని 350 మంది ముస్లిం భక్తులు (Muslim devotees) అయోధ్యకు చేరుకుని రామాలయంలో దర్శనం చేసుకున్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ (Muslim Rashtriya Manch - MRM) నేతృత్వంలో  ఈ బృందం జనవరి 25 న లక్నో నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించిందని MRM మీడియా ఇన్‌ఛార్జ్ షాహిద్ సయీద్ బుధవారం తెలిపారు.350 మంది ముస్లిం భక్తులతో కూడిన 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేస్తూ తీవ్రమైన చలికి కూడా లెక్కచేయకుండా దాదాపు 150 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి మంగళవారం అయోధ్య (Ayodhya) కు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. వారు రాత్రి విశ్రాంతి కోసం ప్రతి 25 కిలోమీటర్లకు ఆగి, మరుసటి ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించారని వివరించారు.ఆరు రోజుల తర్వాత, అరిగిపోయిన పాదరక్షలు, అలసిపోయిన కాళ్లతో భక్తులు అయోధ్యకు చేరుకుని కొత్తగా ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహానికి మొక్కులు చెల్లించుకున్నారని సయీద...