PM Modi : మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు ప్రపంచ ఆకర్షణ
ఆపరేషన్ సిందూర్ విజయం: 22 నిమిషాల్లో ఉగ్ర నేతల ఇళ్లు నేలమట్టం'రెడ్ కారిడార్' ఇక 'గ్రీన్ గ్రోత్ జోన్' మారుతోంది.దేశ ఐక్యతకు ఉదాహరణగా అన్ని పార్టీల ఎంపీలుParliament Monsoon session ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో ఉగ్రవాద సంస్థల యజమానుల ఇళ్లు కేవలం 22 నిమిషాల్లోనే నేలమట్టం అయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. దీని ద్వారా మేడ్ ఇన్ ఇండియా సైనిక శక్తికి ప్రపంచం చాలా ఆకర్షితులైందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు సోమవారం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. “ఈ రోజుల్లో, నేను ప్రపంచ ప్రజలను కలిసినప్పుడల్లా, భారతదేశం తయారు చేస్తున్న మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల పట్ల ప్రపంచ ఆకర్షణ పెరుగుతోంది” అని ఆయన అన్నారు.'రెడ్ కారిడార్లు' 'గ్రీన్ గ్రోత్ జోన్లు'గావర్షాకాల సమావేశాల ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "నేడు, మన భద్రతా దళాలు కొత్త ఆ...