
Bastar : బస్తర్ మారుతోంది.. ఇప్పుడు 300 టవర్లతో కమ్యూనికేషన్ విప్లవం
Bastar Development :గత ఏడాది కాలంలో మావోయిస్టుల పట్టు నుంచి విముక్తి పొందిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని గ్రామాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం 300 సెల్ ఫోన్ టవర్లను (Bastar Mobile Towers) ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, మావోయిస్టు గ్రూపుల మధ్య సెల్ ఫోన్ టవర్లు మొదటి నుంచీ ఒక ప్రధాన వివాదంగా ఉన్నాయి. ప్రభుత్వానికి, టవర్లను ఏర్పాటు చేయడం వ్యూహాత్మక ప్రాధాన్యం.. కానీ మావోయిస్టులు వాటిని నాశనం చేయడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తారు.కాగా కనీసం 32 సెల్ ఫోన్ టవర్ల (Bastar Telecom Towers )ను ప్రత్యేకంగా అబుజ్‌మడ్ లో ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో దాదాపు 5,000 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది. సాయుధ మావోయిస్టు కేడర్లతో చివరి పోరాటం ఇక్కడే జరుగుతోంది. శుక్రవారం ...