Saturday, August 30Thank you for visiting

Tag: Missiles

Operation Sindoor LIVE : పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడులు..

Operation Sindoor LIVE : పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడులు..

National
Operation Sindoor LIVE : భారత్, పాక్ సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్‌ దాడి చేయడంతో.. భారత్ దీటుగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై ఒక్కసారిగా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి సైతం ధ్రువీకరించారు.పాక్‌ సైన్యం (Pakistan Air Force) హెడ్‌క్వార్టర్‌ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ సైన్యం ప్రకటించుకుంది.ఇక భారత్‌పై దాడులకు దాయాది దేశం ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ (బలమైన పునాది) అనే పేరుపెట్టింది. కాగా ఈ దాడులపై భారత వాయుసేన, సైన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.నేటి ఉదయం 10 గంటలకు భారత ఆర్మీ ప్రెస్‌...