Medaram Trains | మేడారానికి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రత్యేక రైళ్లు మీకోసమే.. టైమింగ్స్ ఇవే..
Medaram Trains : మేడారం(Medaram) సమ్మక్క, సారక్క జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆదివాసీలతోపాటు , తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సాధారణ భక్తులు కూడా లక్షలాదిగా తరలివస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను (TS RTC) నడిపిస్తోంది. అలాగే వేలాదిగా ప్రైవేట్ వాహనానాల్లో అమ్మవార్ల దర్శనానికి వస్తున్నా.. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు ఏమాత్రం రవాణా సౌకర్యాలు సరిపోవడం లేదు. మరోవైపు హెలికాప్టర్ సేవలు కూడా సిద్ధమయ్యాయి. అయితే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్ల ను కూడా నడిపిస్తోంది. ఆవివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధరణ ప్రజల కోసం 30 ప్రత్యేక జన్ సాదారణ్ రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక...