
Mary Millben | నా మదిని దోచుకున్నారు.. మోదీపై అమెరికన్ గాయని ఫిదా
American singer Mary Millben | భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ (American singer Mary Millben) ప్రశంసల జల్లు కురిపించారు. ఢిల్లీలో నిర్వహించిన కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్రిస్మస్ వేడుకలో ఏసు క్రీస్తును మోదీ (Prime Minister Narendra Modi) కీర్తించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతలో గురువుగా ఏసు పేర్కొనడంపై హర్షం వ్యక్తం చేశారు.లార్డ్ క్రైస్ట్ బోధనలూ ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని ఉటంకిస్తాయని, మనమందరం ఈ ఆత్మను బలపరిచేందుకు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ పిలుపునివ్వడంపై మేరీ మిల్బెన్ హర్షం వ్యక్తం చేశారు. ' మీకు కృతజ్ఞతలు మోదీ గారూ.. ఏసు క్రీస్తు ప్రేమకు గొప్ప కానుక, ఆదర్శం. భారత బిషప్‌ల క్రిస్మస్ వేడుకలో నా రక్షకుడిని గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి' అని ఆమె ట్వీట్ చేశారు. భ...