
Hydra News | స్పీడ్ పెంచిన హైడ్రా.. దుండిగల్, మాదాపూర్‌లో ఆక్రమణల నేలమట్టం
Hydra | హైదరాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలను మరింత ముమ్మరం చేసింది. హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో అక్రమ కట్టడాలను నేలమట్లం చేస్తోంది. కాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా భారీ విల్లాలు నిర్మించారు.దీంతో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఇదిలా ఉండగా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని పరిధిలోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో వెలిసిన షెడ్లు, భవనాలను హైడ్రా బుల్ డోజర్ కూల్చివేసింది. ఎఫ్‌టీఎల్‌ల...