Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
ఇదిలా ఉండగా పీసీసీ చీఫ్ పదవికి మధుయాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గా రెడ్డి, అద్దంకి దయాకర్ పోటీ పడ్డారు. కానీ వీరందరిలో చివరకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం (TPCC President) దక్కింది. పీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై రెండు వారాల క్రితమే కసరత్తు జరగగా, కాంగ్రెస్ పార్టీ నేడు అధికారికంగా ప్ర...