Sunday, August 31Thank you for visiting

Tag: Mahalaxmi Scheme

Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ ‌సిలిండ‌ర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?

Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ ‌సిలిండ‌ర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?

Telangana
Mahalaxmi Scheme Subsidy Gas Cylinder : తెలంగాణ ప్ర‌భుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇటీవ‌లే రూ.500ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇప్ప‌టికే అర్హుల జాబితాను కూడా రూపొందించింది. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పథకానికి అర్హులైన వారి మూడు సంవ‌త్స‌రాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏడాదికి ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. అయితే ఈ పథకానికి మొద‌ట‌ 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరింత తగ్గవచ్చని సమాచారం. అర్హులైన వారిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్‌ ‌సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఇవ్వబోయే...
Mahalaxmi Scheme | రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..  ఆర్టీసీ బస్సుల్లో మెట్రోరైలు త‌ర‌హాలో సీట్లు

Mahalaxmi Scheme | రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..  ఆర్టీసీ బస్సుల్లో మెట్రోరైలు త‌ర‌హాలో సీట్లు

Telangana
mahalaxmi scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ ఆరు హామీల్లో భాగంగా మొట్టమొదటసారిగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప‌థ‌కం కింద మహిళలందరికీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించారు. దీంతో అన్ని బస్సుల్లో ఒక్క‌సారిగా రద్దీ పెరిగింది. మహిళలందరూ ప్రైవేట్ వాహనాల‌ను వ‌దిలి బస్సులను ఆశ్రయిస్తుండటంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బ‌స్సుల్లో ఎక్కువ మంది ప్ర‌యాణికులు పట్టేలా ఆర్టీసీ అధికారులు బస్సు సీట్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైళ్లలో మాదిరిగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసేందుకు చ‌ర్య‌లు చేపట్టారు.Mahalaxmi Scheme  ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది జ‌ర్నీ చేయ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండు వైపులా మెట్రో రైలులో మాదిరిగా సీట్ల‌ను ఏర్పాటు చేశారు. ఫలితంగా మధ...