Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: LPG cylinder

Uttarakhand | మ‌రో రైలు ప్ర‌మాదానికి కుట్ర‌..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్
Crime

Uttarakhand | మ‌రో రైలు ప్ర‌మాదానికి కుట్ర‌..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్

cylinder on the railway tracks : ఉత్తర‌ఖండ్ లో మ‌రో రైలు ప్ర‌మాదానికి దుడ‌గులు కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూర్కీ(Roorkee ) లోని ధండేరా స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఖాళీ ఎల్‌పిజి సిలిండర్ కనిపించడంతో ఉత్తరాఖండ్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే కుట్రను పోలీసులు భగ్నం చేశారు.రైలు డ్రైవర్ సిలిండర్‌ను గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఆదివారం ఉద‌యం 6:35 గంట‌ల‌ సమయంలో, ధంధేరా స్టేషన్ నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లండోరా - ధంధేరా మధ్య పట్టాలపై సిలిండర్ కనిపించిందని రూర్కీలోని స్టేషన్ మాస్టర్‌కు గూడ్స్ రైలు లోకో పైలట్ ఫిర్యాదు చేశాడు. పాయింట్‌మెన్‌ని వెంటనే సంఘ‌ట‌న స్థ‌లానికి పంపించి ప‌రిశీలించ‌గా ఆ సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. అనంతరం సిలిండర్‌ను దంధేరా వద్ద స్టేషన్‌ మాస్టర్‌ కస్టడీలో ఉంచారు. స్థానిక పోలీసులకు, ప్రభుత్వ రైల్వే పోలీసులక...
Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర
Business

Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

LPG cylinder | గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి ఝ‌ల‌క్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ (Commercial LPG cylinder) పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కొత్త ధ‌ర‌ల‌ను ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగ‌ళ‌వారం నుంచే అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు స‌ద‌రు కంపెనీలు వెల్లడించాయి.ధరల పెంపు తర్వాత దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. , ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా ప‌లు రాష్ట్రాల్లో ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి....
Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్‌ వద్ద తప్పిన ప్రమాదం
National

Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్‌ వద్ద తప్పిన ప్రమాదం

Train Derailment | దేశంలో రైలు ప్రమాదాలు జ‌రిగేందుకు కుట్రపూరిత యత్నాలు ఇటీవ‌ల పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో దుండగులు రైలు ప్రమాదాలకు కుట్ర ప‌న్నిన‌ సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న జ‌రిగింది. సోలాపూర్‌ (Solapur) మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్‌ దిమ్మెను పెట్టారు. దానిని గమనించిన లోకో పైలట్ వెంట‌నే స్పందించి రైలు ఢీ కొట్టకుండా తప్పించాడు. లోకో పైలట్‌ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. విష‌యం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆదివారం భివాండి-ప్రయాగ్‌రాజ్‌ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలుప‌ట్టాల‌పై కొంద‌రు దుండ‌గులు గ్యాస్‌ సిలిండర్‌ను ఉంచారు. లోకో పైలెట్ గ‌మ‌నించి ఎమ‌ర్జెన్సీ బ్రే...
Kalindi Express | రైల్వే ట్రాక్ పై గ్యాస్‌ సిలిండ‌ర్‌.. ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పించే కుట్ర‌..!
Crime

Kalindi Express | రైల్వే ట్రాక్ పై గ్యాస్‌ సిలిండ‌ర్‌.. ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పించే కుట్ర‌..!

UtterPradesh | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఎక్స్ ప్రెస్ రైలును కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌ట్టాలు త‌ప్పించేందుకు య‌త్నించారు. ఇందుకోసం పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచారు. ఇదే స‌మ‌యంలో వ‌స్తున్న ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్  ( Prayagraj - Bhiwani Kalindi Express) సిలిండ‌ర్ ను ఢీకొన‌గా అది పాక్షికంగా ధ్వంస‌మై ప‌క్క‌కు జ‌ర‌గ‌డంతో పెను ప్ర‌మాదం తప్పింది. దీనిని 'రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం'గా పోలీసులు పేర్కొన్నారు.కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ వద్ద కాళింది ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంతో గమ్యస్థానం వైపు వెళుతుండగా సిలిండర్‌ను ఢీకొట్టింది. ఎల్‌పిజి సిలిండర్‌ను పట్టాలపై ఉంచి కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్స్ బృందాన్ని పిలిపించారు. రైల...