Friday, April 11Welcome to Vandebhaarath

Tag: lord krishna

Abhyanga Snan | నరక చతుర్దశి అంటే ఏమిటి? ఈ రోజు అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి..?
Life Style

Abhyanga Snan | నరక చతుర్దశి అంటే ఏమిటి? ఈ రోజు అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి..?

Narak Chaturdashi And Significance of Abhyanga Snan | నరక చతుర్దశి అనేది భారతదేశమంతటా దీపావళికి ముందు రోజు జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ . దీనిని '' చోటీ దీపావళి (Choti Diwali) '' అని కూడా అంటారు. నరకాసురుడు అనే రాక్షస రాజును కృష్ణుడు, కాళి, సత్యభామ క‌లిసి సంహ‌రించిన రోజు రోజు కూడా ఇదే. ఎన్నో పురాత‌న ఆచారాలు, నమ్మకాలు ఈ ప్రత్యేక రోజుతో ముడిపడి ఉన్నాయి. నరక చతుర్దశి అంటే ఏమిటి? శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడు ఇదే రోజున నరకాసురుడు అనే రాక్షసుడిని ఓడించి, ప్రపంచాన్ని అతడి భయంకరమైన పాలన నుండి విముక్తి క‌లిగించాడు. ఫలితంగా, ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజ‌యంగా చెప్పుకుంటారు. నరక చతుర్దశి నాడు కొన్ని ఆచారాలను పాటించ‌డం వ‌ల్ల నరకంలోని బాధలను నివారించవచ్చని భ‌క్తులు నమ్ముతారు.స్నానం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజువారీ పని. మనమందరం స్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతాం. అయితే, సాధార...
Krishnashtami 2024 |  కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? , శుభముహర్తం ఏమిటి?
Trending News

Krishnashtami 2024 | కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? , శుభముహర్తం ఏమిటి?

Krishnashtami 2024 | ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత‌ వైభవంగా జరుపుకునే పండగల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్ర‌ధాన‌మైన‌ది. కృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి, గోకులాష్టమి అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు. విష్ణువు దశావతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడు. దేవకీ వసుదేవుల ఎనిమిదో సంతానంగా శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడు జన్మించాడు. అందుకే ఈ తిథి రోజున‌ ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? పూజా శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 26, 2024న వస్తుంది. తెల్లవారుజామున 3:39 నుంచి ఆగస్టు 27న తెల్లవారుజామున 2:19 వరకు అష్టమి తిథితో ప్రారంభమమ‌వుతుంది. శ్రీకృష్ణుని ...
Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత …
Special Stories

Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత …

Krishna Janmashtami 2023 : హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, అష్టమి రోహిణి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి 2023 కోసం ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ పండుగ ప్రాముఖ్యతను ఒకసారి పరిశీలిద్దాం. శ్రీ కృష్ణ జన్మాష్టమి చరిత్ర శ్రీ కృష్ణ జన్మాష్టమి, హిందూ మతంలో అతి ముఖ్యమైన పండుగ ల్లో ఒకటి. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం (అవతారం) అయిన శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా నిర్వహిస్తుంటారు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో సుమారు 5,000 సంవత్సరాల క్రితం మధురలో జన్మించాడు. ఆయన జీవిత కథ, భగవద్గీత, భాగవత పురాణం వం...
అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..
Special Stories

అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..

పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక పరిమళాలు వికసిస్తాయి. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలలతో సందడి నెలకొంటుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉంటుందనేది వేద పండితుల మాట. ఎంతో గొప్పదైన పవిత్రమాసం ఈ రోజు (ఆగస్టు 17)న ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ మాసంలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు వస్తున్నాయి.సనాతన ధర్మంలో (హిందూ) చంద్ర మానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో ఎంతో పవిత్రత కలిగింది ఈ శ్రావణమాసం. ఈ నెలలో  పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసమని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది.. త్రిమూర్తుల్లో స్థితికారుడు.. దుష్ట శిక్షకుడు.. శిష్ట రక్షకుడైన మహా విష్ణువుకు ఆయన దేవేరి (భార్య) మహా లక్ష్మికి ఈ శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫ...