Sunday, August 31Thank you for visiting

Tag: kozhikode

Brain Eating Amoeba | దేశంలో మరో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కేసు నమోదు..

Brain Eating Amoeba | దేశంలో మరో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కేసు నమోదు..

Life Style
బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా (Brain Eating Amoeba) మ‌ళ్లీ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. కేర‌ళ రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసును అధికారులు గుర్తించారు. తాజాగా 14 సంవ‌త్స‌రాల‌ బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడికి ఆస్ప‌త్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. దీంతో కేర‌ళ‌లో మెదడును తినే అమీబా సోకిన‌వారి వారి సంఖ్య 4 కు చేరింది. ఇప్ప‌టికే ఈ వైరస్‌బారిన పడినవారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబియా సోకిన బాలుడు జూలై 1న ఆస్ప‌త్రిలో చేరిన‌పుడు ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించామ‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. చికిత్స కోసం విదేశాల నుంచి మెడిసిన్స్ తెప్పిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని డాక్ట‌ర్లు చెప్పారు. మలప్పురం జిల్లాలో ఇటీవల ఓ ఐదేళ్ల బాలిక అమీబిక్‌ మెనింగో ఎన్‌సఫాలిటిస్ (మెద‌డు తినే అమీబా) కార‌ణంగా మృతిచెందింది. మే...
డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ

డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ

National
Japanese encephalitis : కేరళలోని కోజికోడ్‌లో నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో ల్యాబ్ పరీక్షలో నాలుగేళ్ల బాలుడికి ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను పూణే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. జూలై 15న తీవ్రజ్వరం, తలనొప్పి, తీవ్రమైన మెడ నొప్పి వంటి లక్షణాలతో బాలుడిని అడ్మిట్ చేశారు. కాగా "జపనీస్ ఎన్‌సిఫిలైట్స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది, పిల్లలు ఎక్కువగా దీని బారిన పడతారు" అని ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాయా సుధాకర్ తెలిపారు.బాధిత చిన్నారి ప్రభుత్వ వైద్య కళాశాలకు కిలోమీటరు దూరంలోని చేవాయూర్‌లోని చేవారంబలం నివాసి. "సంక్రమణ మరణాల రేటు ఎక్కువగా ఉన్నందున, వ్యాప్తి సంభవించిన ప్రాంతాన్ని శానిటైజ్ చేయాల్సి ఉంది. జపనీస్ ఎన్...