Friday, August 1Thank you for visiting

Tag: Kheral panchayat

Gouri Shankar temple :  హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..

Gouri Shankar temple : హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..

National
Gouri Shankar temple : జ‌మ్మూ క‌శ్మీర్ (Jammu And Kashmir)లోని రియాసి జిల్లాలో హిందూ ఆల‌యం కోసం ఇద్ద‌రు ముస్లింలు త‌మ భూమిని విరాళంగా ఇచ్చి మ‌త సామరస్యాన్ని చాటుకున్నారు. రియాసి జిల్లా (Reasi district) కాన్సి పట్టా గ్రామంలో 500 సంవత్సరాల నాటి పురాతన హిందూ దేవాలయం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ భూమిలో గౌరీ శంకర్ ఆలయాన్ని కలుపుతూ రోడ్డు నిర్మించ‌నున్నారు. ఖేరల్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ తమ నాలుగు కెనాల్ స్థలాన్ని పంచాయితీకి విరాళంగా ఇచ్చారు. దీని విలువ‌ సుమారు కోటి రూపాయల అంచనా. కాగా ఈ స్థలంలో ఆల‌యం కోసం 1200 మీటర్ల రహదారిని 10 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు.పంచాయతీ నిధులతో త్వరలో రోడ్డు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో టెంపుల్ రోడ్ నిర్మించడానికి ముస్లింలు భూమిని విరాళంగా ఇచ్చారని తెలిపారు. మాజీ పంచాయతీ సభ్యుడు, రైతు గులాం రస...