
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
కీర్తనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సంఘ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ 16 డివిజన్ కీర్తినగర్ హౌసింగ్‌బోర్డ్‌కాలనీ (కోటిలింగాల బస్తీ) లోని అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సంక్రాంతి ఉత్సవం (Sankranthi Utsavam) ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య వక్తగా వరంగల్ మహానగర్ కార్యకారిణి సదస్య్ అల్లోజు వెంకటేశ్వర్లు, ముఖ్యఅతిథిగా కాశిబుగ్గ నగర సహా కార్యవహా దినేష్ తోపాటు పెద్ద సంఖ్యలో స్వయంసేవక్‌లు, కాలనీవాసులు, చిన్నారులు హాజరయ్యారు.ఈసందర్భంగా అల్లోజు వెంకటేశ్వరు ప్రసంగిస్తూ.. సంక్రాంతి పర్వదినం విశిష్టత, భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలను విశ్లేషణాత్మకంగా వివరించారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని 'సంక్రమణం' అంటారని, సూర్యుడు ధనస్సు రాశి నుంచి తన కుమారుడైన శనీశ్వరుడికి అధిపతిగా ఉన్న మకర రాశిలోకి ప్రవేశ...
