Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..
Delhi Excise Policy Case Updates : దిల్లీ లిక్కర్ కేసులో (Delhi Excise Policy Case) వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీలో కవిత ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది కానీ కోర్టు కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏప్రిల్ 15 వరకు కవితను సీబీఐ విచారించనున్నది.
మరో వైపు.. కవితకు దిల్లీ కోర్టులో వరుసగా షాక్ లు తగులుతున్నాయి. కవిత సమర్పించిన రెండు పిటిషన్లను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు, సీబీఐ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు ...