
కరీంనగర్‌లో చరిత్ర సృష్టించిన బీజేపీ: తొలిసారి కార్పొరేషన్‌పై కాషాయ జెండా.. – Karimnagar Mayor BJP
కరీంనగర్ : ఉత్తర తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం (ఫిబ్రవరి 16) జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.34 ఓట్లతో ఘన విజయంమేయర్ ఎన్నికలో BJP అభ్యర్థికి మొత్తం 34 ఓట్లు లభించాయి. పార్టీకి చెందిన కార్పొరేటర్లతో పాటు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన ఒక కార్పొరేటర్, ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇవ్వడం కీలకంగా మారింది. అలాగే కేంద్ర మంత్రి, ఎంపీ Bandi Sanjay Kumar ఎక్స్ అఫిషియో ఓటు కూడా BJPకి కలిసివచ్చింది.ఇక Bharat Rashtra Samithi ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.కరీంనగర్‌లో ...
