వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాంకబరి పూజలు
Warangal news | వరంగల్ 16వ డివిజన్ కీర్తి నగర్ కాలనీలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి శాకంబరి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని భక్తులు వివిధ కూరగాయలు ఫలాలతో అద్భతంగా అలంకరించారు. వేదపండితులు లక్ష్మీ నరసింహాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, ఆర్యవైశ్య జిల్లా మహాసభ జిల్లా సెక్రెటరీ గందె శ్రీనివాస్ దంపతులు, పొట్టి శ్రీనివాస్, కాలనీ వైశ్యులు మండల ఆర్యవైశ్య సంఘం, కీర్తినగర్ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొడకండ్ల భద్రయ్య, కమిటీ సభ్యులు, కీర్తి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ...