
Sanchar Saathi | కొత్త ఫోన్లలో ‘సంచార్ సాథి’ యాప్ ఇన్‌స్టాల్ తప్పనిసరి: DoT ఆదేశాలు
యాప్‌ను తొలగించే స్వేచ్ఛ వినియోగదారులదే: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టీకరణన్యూఢిల్లీ : టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో 'సంచార్ సాథి' యాప్ (Sanchar Saathi App) ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులను ఆదేశించింది. అయితే, దీనిపై వినియోగదారుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా స్పష్టత ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టం లేకుంటే ఆ యాప్‌ను తమ ఫోన్ల నుంచి తొలగించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.90 రోజుల్లో యాప్ ఇన్‌స్టాలేషన్ తప్పనిసరిసిమ్‌కార్డుల దుర్వినియోగాలు, సైబర్ మోసాలను నివేదించే అప్లికేషన్ అయిన 'సంచార్ సాథి'ని, ఉత్తర్వులు జారీ అయిన 90 రోజులలోపు భారతదేశంలో తయారు చేయబడిన లేదా దిగుమతి చేసుకున్న అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో ముందే ఇన్‌స్...
