
జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం
నలుగురు నిందితుల అరెస్ట్
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి వెళ్తున్న 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ముందు బాధితురాలి ప్రియుడిపై ముగ్గురు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. అయితే సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఉమేష్ మిశ్రాతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు సత్వరమే అరెస్టు చేయడం అభినందనీయమని గెహ్లాట్ అన్నారు.బాలిక శనివారం అజ్మీర్‌కు చెందిన తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి వారు బస్సులో బయలుదేరి రాత్రి 10:30 గంటలకు జోధ్‌పూర్ చేరుకున్నారు...