AP Elections | ఏపీలో ఒంటరిగానే బీజేపీ పోటీ..!!
AP Elections | న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే చాన్స్ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించేందుకు టీడీపీ – జనసేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.. ఈ రెండు పార్టీలో ఇటీవలే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల మొదటి జాబితాను కూడా విడుదల చేశాయి. అయితే భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ – జనసేనతో కలిసి పోటీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్లకుండా బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఆంధ్రప్రదే...