Jeet Adani : ఏటా 500 మంది వికలాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విరాళం అందిస్తాం..
Jeet Adani : వికలాంగులైన కొత్తగా పెళ్లైన యువతులకు చేయూతనందించేందుకు దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ (Jeet Adani ) ఆయన కోడలు దివా (Diva Shah) ముందుకు వచ్చారు. మంగళ సేవ (Mangal Seva) పేరుతో 500 మంది వికలాంగ యువతలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బుధవారం (ఫిబ్రవరి 5) ప్రకటించారు .జీత్ అదానీ తన వివాహానికి రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన నివాసంలో 21 మంది కొత్తగా వివాహం చేసుకున్న వికలాంగులైన మహిళలను వారి భర్తలను కలిశారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో దివా షాను ఆయన వివాహం (Jeet Adani Diva Shah Wedding) చేసుకోనున్నారు.ఈ విషయమై గౌతమ్ అదానీ X పై తన ఆనందాన్ని పంచుకున్నారు, జీత్, దివా కలిసి వారి ప్రయాణంలో మొదటి అడుగు ఈ గొప్ప లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. మంగళ సేవ అనేక మంది వికలాంగ మహిళలకు వారి ...