
Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..
Pawan Kalyan Jana Sena Party Formation Day | జనసేన పార్టీ పుట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సభ (Jana Sena Party Formation Day)ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పదేళ్ల తర్వాత 2024 జూన్ 4న తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 21 ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుని '100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్' సాధించిన రికార్డు నమోదు చేసింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ తొలిసార...