Israel – Palestine Conflict | ఇజ్రాయెల్, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు.కాగా హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మ...