iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం
Tamil Nadu | తమిళనాడులో ఇటీవల ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక భక్తుడి ఐఫోన్ (iPhone) అనుకోకుండా ఆలయంలోని హుండీలో పడిపోయింది. అయితే ఆలయ అధికారులు హుండీలో ఉన్న వస్తువులను దేవుడికి నైవేద్యంగా పరిగణిస్తారని పేర్కొంటూ ఫోన్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.వినాయగపురంలో నివాసముంటున్న దినేష్ గత నెలలో చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత, అతను హుండీలో కొంత నగదును వేశాడు. అయితే చొక్కా జేబులోంచి నోట్లను తీస్తుండగా ఐఫోన్ జారి డబ్బుతోపాటు హుండీలో పడిపోయింది.పొరపాటును గ్రహించిన దినేష్ తన ఫోన్ ను తిరిగి తీసుకోవాలని ఆలయ అధికారులను ఆశ్రయించాడు. అయితే హుండీలో ఒక్కసారి వేసిన వస్తువు దేవుడికే చెందుతుందని అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హుండీని ప్రతి రెండు నెలల వరకు తెరవ...