Thursday, April 17Welcome to Vandebhaarath

Tag: Indonesia

Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..
World

Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..

Python | ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ భారీ కొండచిలువ ఏకంగా ఓ మ‌హిళ‌ను మింగేసింది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన‌ 45 ఏళ్ల ఫరీదా ఆదృశ్యం కాగా మూడు రోజులుగా ఆమె కోసం గాలించారు. దీంతో ఆమె భర్త,ఇరుగుపొరుగువారు చివ‌ర‌కు ఓ రెటిక్యులేటెడ్ కొండచిలువ పొట్ట లోప‌ల మ‌హిళ మృత‌దేహాన్ని (Woman Found Dead inside Python ) కనుగొన్నారు. ఆ కొండచిలువ 5 మీటర్లు (16 అడుగులు) పొడ‌వు ఉంది.గురువారం రాత్రి ఫ‌రీదా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం భ‌ర్త‌తోపాటు గ్రామస్థులు గాలించారు. ఒక చోట భారీ కొండచిలువ పెద్ద పొట్ట‌తో అటూఇటూ క‌దులుతూ క‌నిపించింది. దీంతో అనుమానం వ‌చ్చి దాని పొట్ట‌ను కోసి చూడ‌గా అంద‌రూ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. పాము పొట్ట‌లో ఫరీదా తల కనిపించింది. కొండచిలువ పొట్ట‌లో పూర్తిగా దుస్త...