
India advisory Iran protests | ‘వెంటనే దేశం విడిచి రావాలి’
ఇరాన్‌లోని భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక సూచన:India advisory Iran protests | న్యూఢిల్లీ : ఇరాన్‌లో కొనసాగుతున్న అంతర్గత నిరసనలు, మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy of India) కీలకమైన నూతన అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు, విద్యార్థులు, పర్యాటకులు మరియు వ్యాపారవేత్తలు సాధ్యమైనంత త్వరగా దేశం విడిచి రావాలని రాయబార కార్యాలయం సూచించింది.అడ్వైజరీలోని ముఖ్యాంశాలు:1. దేశం విడిచి వెళ్లాలని సూచన: జనవరి 5, 2025న జారీ చేసిన నోటీసుకు కొనసాగింపుగా ఈ తాజా సలహా జారీ చేయబడింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు వాణిజ్య విమానాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా స్వదేశానికి లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.2. నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలి: ఇరాన్ అంతటా జరుగుతున్న ప్రదర్శనలు, నిరసనల పట్ల...
