
Indian Railways | ఇకపై రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టిక తప్పనిసరి!
ఆహార మెనూ సంచారం ఇకపై ప్రయాణీకులకు SMS అలర్ట్..Indian Railways Focus On Food Safety : ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా రైళ్లలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాల మెనూ, ధరల జాబితాను ప్రదర్శించడం తప్పనిసరి చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Union Minister Ashwini Vishnaw) తెలిపారు. "ప్రయాణికుల సమాచారం కోసం అన్ని ఆహార పదార్థాల మెనూ, ధరలను IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వివరాలతో కూడిన ముద్రిత మెనూ కార్డులు వెయిటర్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. అలాగే అవి డిమాండ్ మేరకు ప్రయాణీకులకు అందించనున్నామని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. పాంట్రీ కార్ల (pantry car)లో కూడా రేట్ల జాబితా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.Indian Railways : ప్రయాణికులకు SMS ల రూపంలో సమాచారం..ఇంకా, భారతీయ రైల్వేలతో పోలిస్తే క్యాటరింగ్ ...