
ఆపరేషన్ సిందూర్‌లో 50 ఆయుధాలు కూడా వాడలేదు.. కొత్త వివరాలు బయటపెట్టిన ఎయిర్ మార్షల్ తివారీ – Indian Air Force
న్యూఢిల్లీ : ఇటీవల, మే నెలలో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొత్త ఫుటేజ్‌లు, ఇతర వివరాలను భారత వైమానిక దళం (Indian Air Force) ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ (Air Marshal Narmdeshwar Tiwari) వెల్లడించారు. పెహల్గామ్ దాడిలో 26 మంది మరణానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే..పాకిస్తాన్(Pakistan) మోకరిల్లడానికి భారత వైమానిక దళం 50 కంటే తక్కువ ఆయుధాలను ప్రయోగించిందని ఎయిర్ మార్షల్ తివారీ వెల్లడించారు. మేం దాడి చేయడానికి మాకు పెద్ద సంఖ్యలో లక్ష్యాలు ఉన్నాయి. కానీ చివరకు, మేము తొమ్మిదికి తగ్గించాము" అని ఎయిర్ మార్షల్ తివారీ ఓ జాతీయ మీడియా సమ్మిట్‌లో తన ప్రసంగంలో అన్నారు."50 కంటే తక్కువ ఆయుధాలతో, మేము పూర్తి నియం...