
Venezuela | అమెరికా-వెనిజులా యుద్ధంతో భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
US Attack on Venezuela 2026: అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. దక్షిణ అమెరికా దేశం వెనిజులాపై అమెరికా సైన్యం భారీ దాడులకు దిగింది. వెనిజులా రాజధాని కారకాస్ నగరం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. మీడియా నివేదికల ప్రకారం, నగరవ్యాప్తంగా కనీసం ఏడు పెద్ద పేలుళ్లు సంభవించగా, గగనతలంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న యుద్ధ విమానాల శబ్దాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఒక "నియంత"గా అభివర్ణిస్తూ, ఆయన నాయకత్వాన్ని గుర్తించేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది.భారతదేశంపై ఈ దాడి ప్రభావం ఎందుకు?వెనిజులాలో జరుగుతున్న ఈ యుద్ధం సుదూర ప్రాంతంలో ఉన్నప్పటికీ, భారతదేశంపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనుంది. దీనికి ప్రధాన కారణాలు:చమురు సంక్షోభం (Energy Security)భారతదేశం తన...
