
శత్రువులకు ఇక వణుకే.. మొదటిసారిగా రైల్ లాంచర్ నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగం – Agni-Prime Missile Launch
Agni-Prime Missile Launch : రక్షణ రంగంలో భారత్ మరో భారీ విజయాన్ని సాధించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించారు. అంటే దీనిని కదిలే రైలు నుంచి ప్రయోగించవచ్చు. ఈ విజయవంతమైన పరీక్షతో, రైలు నెట్‌వర్క్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం గల క్యానిస్టరైజ్డ్ లాంచ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న ఎంపిక చేసిన దేశాల సమూహంలో భారతదేశం సైతం చేరింది.రైల్ లాంచర్ అంటే ఏమిటి?రైలు లాంచర్ అనేది రైలు పట్టాలపై నడిచే ఒక ప్రత్యేక రైలు లాంటి వ్యవస్థ. క్షిపణిని ఒక బోగీలో అమర్చుతారు. రైలు కదులుతున్నప్పుడు క్షిపణిని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని గతంలో స్థిరమైన ప్రదేశం లేదా ట్రక్కు నుంచి ప్రయోగించేవారు. అయితే, మొదటిసారిగా, భారత సైన్యం ఈ క్షిపణిని రైలు ద్వారా శత్రు స్థానాల్లోకి ప్రయోగించ...
