Secunderabad : ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..
Secunderabad : సికింద్రాబాద్‌లో ఆదివారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు ముత్యాలమ్మ ఆలయం (Muthyalama temple) లో విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించినట్లు సమాచారం. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయం నుంచి పెద్ద శబ్దం విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఒక వ్యక్తిని పట్టుకున్నారు. వారు అతడిని పోలీసులకు అప్పగించారు. ఉదయం నుంచి గుడి దగ్గర గుమిగూడిన పెద్ద సంఖ్యలో ప్రజలు.. అక్రమార్కులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా ముత్యాలమ్మ గుడి (Muthyalama temple) పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ ఇచ్చిన సమాచార...