Saturday, August 30Thank you for visiting

Tag: Hyderabad RTC buses

హైదరాబాద్ ప్రజలకు TSRTC శుభవార్త – టీఏవైఎల్ టిక్కెట్‌పై ప్రత్యేక తగ్గింపు

హైదరాబాద్ ప్రజలకు TSRTC శుభవార్త – టీఏవైఎల్ టిక్కెట్‌పై ప్రత్యేక తగ్గింపు

Telangana
హైద‌రాబాద్ ప్రయాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ (TSRTC) శుభ‌వార్త చెప్పింది. పంద్రాగ‌స్టు వేడుల‌ సందర్భంగా 'ఫ్రీడమ్ ఆఫర్' కింద ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టిక్కెట్ ధరను తగ్గించింది. అయితే ఈ ఆఫ‌ర్‌ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్ల‌డించారు.హైద‌రాబ‌ద్‌ మెట్రో డీలక్స్ బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ఈ టిక్కెట్లను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. పెద్దలకు ఇంతకు ముందు టిక్కెట్ ధర రూ.150 కాగా, ఫ్రీడ‌మ్‌ ఆఫర్ కింద 130 రూపాయ‌ల‌కు తగ్గించారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు ఇంతకు ముందు రూ. 120గా ఉన్న టిక్కెట్ ధరను రూ. 110కి తగ్గించారు. పిల్లలకు రూ. 100 ఉండగా, దీనిని రూ. 90కి సవరించారు....