Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: hyderabad nalas

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..
Telangana

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. ...
గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..
Telangana

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం  వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ  ప్రయాణా...