How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచర్.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..
How To Book Current Ticket : దీపావళి పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, ప్రజలు చేసే అతి ముఖ్యమైన పని, తమ ఇళ్లలో తేవి తమ బంధువులతో కలిసి పండుగలను ఆస్వాదించాలనే ఆశతో రైలు టిక్కెట్ బుకింగ్ చేసుకోవడం.. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది కన్ఫార్మ్ రైలు టిక్కెట్‌ను దొరకడం చాలా కష్టమైన పని. అనేక మార్గాల్లో రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతుంటాయి. ఇక హైదరాబాద్ నుంచి, విజయవాడ, విశాఖపట్నం చెన్నై మార్గాల్లో ప్రయాణించే రైళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. తత్కాల్‌లో సీటు వస్తుందో రాదో నమ్మకంగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితిలో ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇదే కరెంట్ టికెట్ ఆప్షన్. దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయమేమిటంటే రైలు రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత మీరు కరెంట్ టిక్కెట్‌ను బుక్ చేసుకుని ప్రయాణించవచ్...