Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Hindu temples

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాంకబరి పూజలు
National

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాంకబరి పూజలు

Warangal news | వరంగల్ 16వ డివిజన్ కీర్తి నగర్ కాలనీలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి శాకంబరి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని భక్తులు వివిధ కూరగాయలు ఫలాలతో అద్భతంగా అలంకరించారు. వేదపండితులు లక్ష్మీ నరసింహాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, ఆర్యవైశ్య జిల్లా మహాసభ జిల్లా సెక్రెటరీ గందె శ్రీనివాస్ దంపతులు, పొట్టి శ్రీనివాస్, కాలనీ వైశ్యులు మండల ఆర్యవైశ్య సంఘం, కీర్తినగర్ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొడకండ్ల భద్రయ్య, కమిటీ సభ్యులు, కీర్తి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ...
ప్రభుత్వ ఆధీనంలోని దేవాల‌యాల‌ను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..
Trending News

ప్రభుత్వ ఆధీనంలోని దేవాల‌యాల‌ను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..

VHP campaign | తిరుపతి బాలాజీ ఆలయ ప్రసాదాల వివాదం నేపథ్యంలో., VHP మంగళవారం దేశవ్యాప్తంగా ప్ర‌చారం చేప‌ట్టింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలను విడిపించేందుకు విస్తృత‌ ప్రచారాన్ని ప్రకటించింది. ఆల‌యాల‌ నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దేవాలయాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం "ముస్లిం ఆక్రమణదారులు" మరియు "వలసవాద" బ్రిటీష్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.ప్రభుత్వాలు తమ సంపదను దోచుకోవడానికి, ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేని రాజకీయ నాయకులకు ప‌దవులు కల్పించేందుకు ఆలయాలను ఉపయోగించుకుంటున్నాయని విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ విలేఖరుల సమావేశంలో అన్నారు. "లడ్డూ ప్రసాదాల పవిత్రతను కాపాడేందుకు "శుద్ధి కర్మలు" నిర్వహించనున్నామ‌ని ట‌ బోర్డు పేర్కొంది.ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ చేశారని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో 'మొత్తం హిందూ సమాజం ఆగ్రహం వ్య‌క్త‌మైంద‌ని జైన్ అన్నారు...
Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల
Telangana

Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల

తెలంగాణలో దేశంలోనే  రెండో అతిపెద్ద లింక్ బ్రిడ్జి  Telangana Temples  | రాష్ట్రంలోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, కీసర రామలింగేశ్వరస్వామి, రామప్ప ఆలయాలతోపాటు ఇత‌ర ప్ర‌ధాన ఆల‌యాల అభ‌వృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. ప్రముఖ దేవ‌స్థానాలు.. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామితి, యాదాద్రి దేవాలయ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్‌ ‌ప్లాన్ పై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ప‌లు కీల‌క విష‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. ‌రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ, పర్య...