Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: Hindu Temple

iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం

iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం

Trending News
Tamil Nadu | తమిళనాడులో ఇటీవల ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌టన చోటుచేసుకుంది. ఒక భక్తుడి ఐఫోన్ (iPhone) అనుకోకుండా ఆలయంలోని హుండీలో ప‌డిపోయింది. అయితే ఆలయ అధికారులు హుండీలో ఉన్న వస్తువులను దేవుడికి నైవేద్యంగా పరిగణిస్తారని పేర్కొంటూ ఫోన్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.వినాయగపురంలో నివాసముంటున్న దినేష్ గత నెలలో చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత, అతను హుండీలో కొంత నగదును వేశాడు. అయితే చొక్కా జేబులోంచి నోట్లను తీస్తుండగా ఐఫోన్ జారి డబ్బుతోపాటు హుండీలో పడిపోయింది.పొరపాటును గ్రహించిన దినేష్ తన ఫోన్ ను తిరిగి తీసుకోవాల‌ని ఆలయ అధికారులను ఆశ్రయించాడు. అయితే హుండీలో ఒక్కసారి వేసిన వస్తువు దేవుడికే చెందుతుందని అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హుండీని ప్రతి రెండు నెలల వరకు తెరవ...
Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు

Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు

Trending News
sambhal uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని గుర్తించిన త‌ర్వాత‌ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంభాల్‌లోని ముస్లిం మెజారిటీ సరాయ్ తరిన్ ప్రాంతంలో మ‌రొక‌ పాడుబడిన రాధా-కృష్ణ దేవాలయాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 17న‌ మంగళవారం పోలీసులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆల‌యంలో ఆంజ‌నేయ‌స్వామితోపాటు శ్రీకృష్ణుడు, రాధ దేవత విగ్రహాలను గుర్తించారు. దీంతో వెంట‌నే ఆలయ ప్రాంగణంలో అధికారులు పరిశుభ్రత, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.ఈ పురాతన రాధా-కృష్ణ దేవాలయం చుట్టూ హిందూ కుటుంబాలు వలస పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాడుబడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తిరిగి తెరిచారు. 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని పునఃప్రారంభించిన‌ తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇక్క‌డ‌ ఎలాంటి అల్ల‌ర్లు చోటుచేసుకోకుండా ప‌టిష్ట‌ భద్రత ...
Gouri Shankar temple :  హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..

Gouri Shankar temple : హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..

National
Gouri Shankar temple : జ‌మ్మూ క‌శ్మీర్ (Jammu And Kashmir)లోని రియాసి జిల్లాలో హిందూ ఆల‌యం కోసం ఇద్ద‌రు ముస్లింలు త‌మ భూమిని విరాళంగా ఇచ్చి మ‌త సామరస్యాన్ని చాటుకున్నారు. రియాసి జిల్లా (Reasi district) కాన్సి పట్టా గ్రామంలో 500 సంవత్సరాల నాటి పురాతన హిందూ దేవాలయం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ భూమిలో గౌరీ శంకర్ ఆలయాన్ని కలుపుతూ రోడ్డు నిర్మించ‌నున్నారు. ఖేరల్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ తమ నాలుగు కెనాల్ స్థలాన్ని పంచాయితీకి విరాళంగా ఇచ్చారు. దీని విలువ‌ సుమారు కోటి రూపాయల అంచనా. కాగా ఈ స్థలంలో ఆల‌యం కోసం 1200 మీటర్ల రహదారిని 10 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు.పంచాయతీ నిధులతో త్వరలో రోడ్డు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో టెంపుల్ రోడ్ నిర్మించడానికి ముస్లింలు భూమిని విరాళంగా ఇచ్చారని తెలిపారు. మాజీ పంచాయతీ సభ్యుడు, రైతు గులాం రస...