Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి
Mecca | ఈ ఏడాది హజ్ (Hajj ) యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్య కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్లు పేర్కొంది."ప్రతి సంవత్సరం, చాలా మంది భారతీయ యాత్రికులు హజ్‌ను సందర్శిస్తారు. ఈ సంవత్సరం, ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్ కోసం సౌదీని సందర్శించారు. కోర్ హజ్ కాలం జూలై 9 నుంచి 22 వరకు ఉంది. ఇప్పటివరకు 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గతేడాది మరణాల సంఖ్య 187గా నమోదైంది.సౌదీ అరేబియాలోని మక్కాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రలో 1,000 మంది యాత్రికులు (Hajj pilgrims ) మరణించారని AFP నివేదించింది. అరబ్ దౌత్యవేత్త ప్రకారం.. ఈజిప్టు నుంచి 658 మంది యాత్రికులు మరణించారు. వీరిలో 630 మంది నమోదు కాని యాత్రికులు ఉన్నారు. జోర్డాన్, ఇండోనేష...