Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: govt hospital

తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం..  మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు
Crime, Telangana

తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

 తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.  మార్చురీలో భద్రపరిచిన   ఓ వ్యక్తి మృతదేహంలోని భాగాలను ఎలుకలు కొరికివేశాయి. వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016వ సంవత్సరంలో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రవి రెండో వివాహం చేసుకోగా వీరికి కుమారుడు జన్మించాడు. అయితేతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో రవికుమార్‌ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రవికుమార్‌ క్రమంగా మద్యాన...