
ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.
PM Shram Yogi Mandhan Yojana : భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలు చాలా వరకు దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నారు. భారతదేశంలో, చాలా మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం, పెన్షన్ ఏమాత్రం స్థిరంగా లేవు. అలాంటి వారికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద ఈ కూలీలకు ప్రతినెలా రూ.3000 పింఛను ఇస్తారు. కార్మికులు డబ్బును ఎలా పొందాలి ? ఈ పథకం ప్రయోజనాలు ఏమిటి, దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి పిఎం శ్రమయోగి మంధన్ యోజన కింద పెన్షన్అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. అసంఘటిత రం...