Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: gas cylinder

LPG price cut :  గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..
National

LPG price cut : గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..

LPG price cut | భారతదేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) 19 కిలోల వాణిజ్య సిలిండర్‌, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరను ₹ 30.50 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి . ఈరోజు నుంచే కొత్త ధ‌ర‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. స‌వ‌రించిన ధ‌ర‌ల ప్ర‌కారం.. ఏప్రిల్ 1 నాటికి, ఢిల్లీలో ధర ₹ 1,764.50 గా ఉంది. 5 కిలోల FTL సిలిండర్ల ధర ₹ 7.50 తగ్గింది .ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వ్యాణిజ్య సిలిండర్ల ధ‌ర‌లు రెండుసార్లు పెంచిన విష‌యం తెలిసిందే. . దీనికి ముందు, నూతన సంవత్సరం 2024 సందర్భంగా 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్‌పై ₹ 39.50 చొప్పున ధరలు తగ్గించారు.కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్‌ల ధరలు పెరిగినప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 1న గతంలో చేసిన ప్రకటన తర్వాత సిలిండర్ల ధరలలో ఈ మార్పు వచ్చింది. ఆ సమయంలో,...
CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana

CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే మొదటి బ‌హిరంగ స‌భ‌ను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంత‌కు ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే రూ.500ల‌కు గ్యాస్ సిలిం...