Saturday, August 30Thank you for visiting

Tag: Gandhi movie

రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

Local
హనుమకొండ : భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హన్మకొండ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. 2022లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపేందుకు గాంధీ చిత్రాన్ని (Gandhi movie) ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఉచితంగా సినిమా ప్రదర్శనను నిర్వహించనున్నారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా చిత్రాన్ని చూసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు14వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, 20వ తేదీ ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండ...