
BSNL VoWiFi సేవ ప్రారంభం: మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా Wi-Fi ద్వారా ఉచిత కాల్స్
BSNL VoWiFi service : మీరు BSNL వినియోగదాలైతే మీకో గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం క్రమం తప్పకుండా అనేక అప్‌డేట్స్‌ను అందిస్తోంది. ఈసారి, మొబైల్ నెట్‌వర్క్ లేకుండా కూడా వినియోగదారులు వాయిస్ కాల్స్ చేయగలిగే ఫీచర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. కొత్త ఫీచర్ గురించి మరింత తెలుసుకుందాం…BSNL తన కొత్త VoWiFi (వాయిస్ ఓవర్ Wi-Fi) సేవను ప్రారంభించింది. ఇది వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా కూడా Wi-Fi కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీంతో ఇప్పటికే ఈ సేవను అందిస్తున్న ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీల సరసన బిఎస్ఎన్ఎల్ చేరింది.బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ విస్తరణBSNL తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని VoWiFi సేవలను ప్రారంభించడం గమనార్హం. ఇది ఒక కీలకమైన విజయంగా భా...
