New Flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ఐటీ కారిడార్‌లో త్వరలో 3 కొత్త ఫ్లైఓవర్లు
New Flyovers in Hyderabad : ట్రాఫిక్ జామ్‌లను పరిష్కరించడానికి, ఐటీ కారిడార్‌లో వేగ పరిమితులను పెంచే ప్రయత్నంలో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్‌లను నిర్మించాలని యోచిస్తోంది. దీని కోసం రూ. 800 కోట్లకు పైగా కేటాయించింది.ఎక్కడెక్కడంటే..GHMC ప్రణాళికలతో ఖాజాగూడ, విప్రో మరియు IIIT జంక్షన్లలో మూడు బహుళ-స్థాయి ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు.. ఐఐఐటీ జంక్షన్ ప్రాజెక్టుకు రూ.459 కోట్లు, ఖాజాగూడలోని మరో రెండు ఫ్లైఓవర్‌లకు రూ.220 కోట్లు, విప్రో జంక్షన్‌లకు రూ.158 కోట్లు కేటాయించారు. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు మరో ప్రతిపాదన కూడా ఉంది. హైదరాబాద్‌లోని ఈ మూడు కొత్త ఫ్లైఓవర్‌లు ట్రాఫిక్‌ను సులభతరం చేయడమే కాకుండా నగరం మౌలిక సదుపాయాల వృద్ధికి దోహదపడతాయి. అంతే కాకుండా, నగర వాసులకు మెరుగైన వేగవంతమైన ప్రయాణ అనుభూ...