Sunday, September 7Thank you for visiting

Tag: Fake passport visa punishment

అక్రమ వలసదారులపై కొరడా రెడీ !  చొరబాటుదారులను అడ్డుకునేందుకు కొత్త చట్టం   – Immigration Act 2025

అక్రమ వలసదారులపై కొరడా రెడీ ! చొరబాటుదారులను అడ్డుకునేందుకు కొత్త చట్టం – Immigration Act 2025

Special Stories
Immigration Act 2025 : భారత్​ లో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం కొత్త చట్టం అమలులోకి వచ్చింది. కొత్త నిబంధనలు భారత్​లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ పౌరులను నియంత్రించనుంది. హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త నిబంధనలతో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ను బలోపేతం చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 నియమాలు సెప్టెంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ బిల్లు ఏప్రిల్ 2025లో పార్లమెంటులో ఆమోదించింది. ఈ బిల్లు కింద, ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు భారతదేశంలోని విదేశీ పౌరులను పరిశీలించి, వారిపై చర్యలు తీసుకునే చట్టపరమైన హక్కులు ఇచ్చింది. ఈ చట్టంతో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వంటి అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చు ఈ బిల్లులో ప్రత్యేకత ఏమిటి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకుందాం..Immigration Act 2025 చట్టంలోని నిబంధనలు...