
FCI : ఎఫ్‌సీఐ బియ్యం ధర క్వింటాల్‌కు రూ.550 తగ్గించిన కేంద్రం
New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్‌కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్‌కు రూ. 2,250గా నిర్ణయించిన కొత్త ధర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇథనాల్ తయారీదారులకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇథనాల్ (Ethanol) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు..సవరించిన ధర ఇథనాల్ ఉత్పత్తి ప్రోత్సహించడంతోపాటు వివిధ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల కోసం బియ్యం లభ్యతను పెంచుతుందని కేంద్రం పేర్కొంది. ఈ చొరవ బియ్యం మార్కెట్లను స్థిరీకరించడానికి జీవ ఇంధన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి దోహదం చేయనుంది.కొత్త సవరించిన ధరల వల్ల స్టాక్ స్థాయిలను నిర్వహించడానికి, సరఫరా గొలుసు ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఇంధన భద్రతను ...